ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని తనగంపాడు సర్పంచ్ కేతినేని వేణు ఆధ్వర్యంలో పలువురు బీ ఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో శనివారం వీరికి కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. హస్తం గూటికి చేరినవారిలో వార్డు సభ్యుడు ములకలపల్లి ఉపేందర్, చల్లా సంజీవరావు, చల్లా ఉపేందర్, హనుమంతరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, తిరుమలకొండ నాగరాజు, తొట్ల విజయ్, బోడ వెంకన్న, కందుకూరి వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.