పీవీ నరసింహారావుకు ఘన నివాళి

 

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో పివి నరసింహారావు 19వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టి పి సి సి ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు జిల్లా ఐఎన్ టియు సి అద్యక్షులు కొత్తా సీతారాములు కాంగ్రెస్ నాయకులతో కలిసి పీ వి నరసింహారావు చిత్ర పటానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బహు భాషా కోవిదుడుగా సమాజంలో స్థిర స్థాయి గా నిలిచి పోయారని కొనియాడరు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దినెని రమేష్, పాలకుర్తి నాగేశ్వరరావు,కూల్ హోమ్ ప్రసాద్, దిరిశాల చిన్న వెంకటేశ్వరరావు, కొట్టేముక్కల నాగేశ్వరరావు, సంపటం నరసింహరావు,నగర కాంగ్రెస్ ఓబీసీ ఐ ఎన్ టి యు సి అద్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ నగర కాంగ్రెస్ నాయకులు నుకారపు వెంకటేశ్వరరావు, యాసబోయిన శ్రీశైలం, బండి నాగేశ్వరరావు, రజీ, వాసిం, ముజాహిద్దీన్,ఫరీద్, సగతెవరాజు, సిరంసెట్టి వేణు, బెజ్జం గంగాధర్, సుగుణ, జాని తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking