బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామం ఎ ఎల్ ఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు. సోమవారం ఈ సంధర్బంగా కొక్కీరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…నాన్ను నిమ్మీ కాంగ్రెస్ పార్టీ చెరిన నాయకులు, కార్యకర్తలు,యువకులు స్వాగతం పలికారు, అంతేకాకుండా మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఇందుకోసం ప్రతి కార్యకర్త సన్నద్ధమై సమన్వయంతో పనిచేయాలని సూచించినారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అని అన్నారు.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల స్కీములను 100 రోజుల్లోపు అమలు చేస్తామని అన్నారు.ఈ సందర్భంగా దండేపల్లి మండలంలోని తాళ్ల పేట,ద్వారక మామిడిపల్లి లింగాపూర్ రాజు కూడా గ్రామాలకు చెందిన సుమారు 200 మంది టిఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేష్,జడ్పిటిసి గడ్డం నాగరాణి – త్రిమూర్తి,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్,ముత్తే
రాజన్న,తోట మోహన్, సర్పంచులు సీనియర్ వనపత్తి రవి,నెల్లి సుభాష్,నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు అక్కల శకుంతల,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking