అత్యవసర సేవలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం

పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నవంబరు 7వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే వివిధ విభాగాలకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అందులో భాగంగా 13 శాఖలకు సంబంధించి బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ప్రత్యేకంగా అవకాశం ఉందని తెలిపారు. దీనికి సంబంధించి (1).ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ఇండియా, (2) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, (3) భారతీయ రైల్వే, (4). ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, (5) దూరదర్శన్, (6) ఆల్ ఇండియా రేడియో, (7) విద్యుత్తు శాఖ, (8) ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం, (9) రాష్ట్ర రవాణా సంస్థ, (10). ఆహారం, పౌర సరఫరాలు, (11). బీఎస్ఎన్ఎల్, (12). పోల్ డే కవరేజ్ కోసం ఈసీఐ (ఈసీఐ) ద్వారా అధికారం పొందిన మీడియా వ్యక్తులు, (13) అగ్నిమాపక సేవలు తదితర విభాగాలలో విధులలో నిమగ్నమై ఓటు హక్కును వినియోగించుకోలేని వారు మాత్రమే దరఖాస్తులను ఫారం -12 (డీ) లో తమ పూర్తి వివరాలతో సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేయబడుతుందని ఈ మేరకు నవంబర్ 7వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. దరఖాస్తు ఫారాలను రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల నుంచి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వివరించారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం రిటర్నింగ్ అధికారులు అబ్సెంటీ లిస్టు (absentee list) లను తయారు చేస్తారని, దరఖాస్తులోని వివరాలను ఎలక్ట్రోరల్ రోల్లోని వివరాలతో సరిపోల్చిన అనంతరం అర్హత గల ఓటర్ల లిస్టులను తయారు చేసి వారికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను అందచేస్తారని పేర్కొన్నారు. అనంతరం వారు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ) లలో ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఓటింగ్ కేంద్రాలు, సమయ వివరాలు దరఖాస్తులలోని మొబైల్ నెంబర్లకు, బూత్ లెవెల్ అధికారుల ద్వారా తెలియచేయడం జరుగుతుందని ఈ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు పోలింగ్ బూత్లలో ఓటు అవకాశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పోలింగ్ తేదీకి ముందు మూడు రోజులలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక నోడల్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారితో పాటు గెజిటెడ్ అధికారిని నియమిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking