కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 20 : కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నుంచి బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.దండేపల్లి మండలంలోని దండేపల్లి, ముత్యంపేట,కన్నెపిల్లి, కాశిపేట,ద్వారక,గ్రామల నుండి సీనియర్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ చెరిన నాయకులు మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లు చేసిన మోసాలు చూసి ఇక మోస పోవద్దని బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది.ఈ సారి మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ జిల్లా నాయకులు, అక్కల రాజయ్య,సుధాకర్, వేంకటేష్,రవి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking