ఈవీఎంల ర్యాండమైజేషన్

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులకు ఎన్నికల సామాగ్రి, కౌంటింగ్, స్ట్రాంగ్రూమ్ తదితర వివరాలపై అవగాహన అవసరమని ఈ విషయంలో వారికి పూర్తి స్థాయిలో వివరించామని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్స్ 2,397కు బ్యాలెట్ యూనిట్ గాను 25 శాతం ర్యాండమైజేషన్ చేయగా 2,997 అయ్యాయని అలాగే కంట్రోల్ యూనిట్లు (సీయూ) కూడా 2,397ఉండగా ర్యాండమైజేషన్ ప్రక్రియ తర్వాత 2,997 అయినట్లు తెలిపారు. వీవీ ప్యాట్ల విషయంలో 2,397కు గాను 40 శాతం ర్యాండమైజేషన్ చేపట్టగా 3,356కు పెరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎమ్ గోడౌన్లకు గుర్తింపు పొందిన రాజకీయ నాయకులు, అధికారులు వెళ్ళి శిక్షణ మరియు అవగహన నిమిత్తం, బ్యాలెట్ యూనిట్ 192, కంట్రోల్ యూనిట్ 192, వీవీ ప్యాట్ 192 తీసి మిగతా వాటికీ ర్యాండమైజేషన్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపినారు . ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఎన్నికల అధికారులు, ఆయా పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking