ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 05 : మంచిర్యాల నియోజకవర్గం లోని పలు మండలాలకు చెందిన
బీఆర్ఎస్ నేతలు,ప్రజాప్రతి నిధులు ఆపార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. మంగళవారం మంచిర్యాల, హజీపూర్,లక్షెట్టిపేట,నస్పూర్,దండేపల్లి మండలాలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరేందుకు పెద్ద సంఖ్యలో 150 వాహణతో పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కు తరలివెళ్లారు.
బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతి నిధులు వారి రాజీనామా పత్రాలను తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సమర్పించి నివాళులు అర్పించారు.అనంతరం హజీపూర్ లో అంబేడ్కర్ విగ్రహానికి అంజలి ఘటించారు.అనంతరం భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ వెళ్లారు.మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఇంచార్జి మానిక్ రావు ఠాక్రే, ఏ.ఐ. సీ.సీ.కార్యదర్శి రోహిత్ చౌదరి లు వారికి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.హాజీపూర్ జడ్పిటిసి పుస్కురి శిల్ప, హాజీపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ రావు,మాజీ జెడ్పిటిసి రాచకొండ ఆశలత వెంకటేశ్వరరావు, హాజీపూర్ మాజీ ఎంపిటిసి బొడ్డు శైలజ శంకర్,హాజీపూర్ టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు దొమ్మటి సత్తయ్య,వేంపల్లి మాజీ సర్పంచ్ గోనె సంజయ్,సీనియర్ న్యాయవాది,తెలంగాణ ఉద్యమకారుడు నాయకులు సిరిపురం శ్రీనివాస్,ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు మాధవరపు జితేందర్ రావు,మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ పట్టణ అధ్యక్షుడు సాగే సుమోహన్, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ మురళీధర్,సీనియర్ బిఆర్ఎస్ నాయకులు సంగతి మురళి,సీనియర్ బిఆర్ఎస్ నాయకులు చిలువేరు నాగేశ్వరరావు వీరితో పాటు దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారిలో ఉన్నారు.వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే దివాకర్ రావు,విజిత్ రావు ఒంటెద్దు పోకడలకు విసిగిపోయి బీఆరెస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినట్లు వారు తెలిపారు.