ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 05 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా అన్ని విభాగాల విద్యార్థులు టీచర్స్ గా అవతారమెత్తి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ఆయా విభాగాల నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు ఎంపిక చేశారు.ఈ టీచర్స్ డే వేడుకల బోధన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓఝా పర్యవేక్షణలో జరిగింది.అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి,ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.గురుకుల బాలికల పాఠశాల/కళాశాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా,అధ్యాపకులు,బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking