ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 05 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల నందు మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.కళాశాల ప్రిన్సిపల్ ఎం లలిత కుమారి అధ్వర్యంలో చాలా ఘనంగా జరిపారు.డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని,సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో విద్యార్థినులందరూ కలిసి, ప్రిన్సిపల్ తో పాటుగా, ఉపాధ్యాయినులందరినీ ఘనoగా సన్మానం చేసారు.ఇందులో భాగంగా, ఉపాధ్యాయినులందరికీ, శాలువాలు కప్పి,మెమెంటోలు బహుకరించడమే కాకుండా, మహిళా ఉపాధ్యాయినులను సంప్రదాయబద్ధంగా తమలపాకులు,కుంకుమ, పసుపు,పూలు,గాజులు, పండ్లు కానుకలుగా ఇచ్చి,గొప్ప సత్కారం చేశారు.ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ… “సమాజంలో ఉపాధ్యాయుల యొక్క బాధ్యత గురుతరమైనదని తల్లిదండ్రుల తరువాత గురువు యొక్క ప్రభావశీలత విద్యార్థులపై ఎక్కువగా ఉంటుందని, భవిష్యత్తులో గొప్ప పౌరులుగా ఎదిగినటువంటి విద్యార్థులు. అందరూ తమకు చదువు చెప్పినటువంటి గురువులను మర్చిపోకుండా, గౌరవభావాన్ని కలిగి ఉండాలని,” ఈ సందర్భంగా పిల్లలకు ఉద్బోధించారు.అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వర రావు, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ జి మౌనిక, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ,టీచర్ల యొక్క గొప్పతనాన్ని, తెలియజేశారు. తరువాత కొంతమంది విద్యార్థినులు కూడా ప్రసంగిస్తూ, ఉపాధ్యాయుల గొప్పతనాన్ని గురించి తోటి విద్యార్థినులకు తెలియజేశారు. అనంతరం, విద్యార్థినులు.అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లలందరికీ మిఠాయి పంపిణీ చేశారు.