మృతిదేహానికి పూలమాలలు వేసి, ఆర్థికసహయం అందజేసిన పీఏ రవికిరణ్
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 5 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చింతగుర్తి గ్రామంలో మృతిచెందిన ఆళ్ల చిట్టెమ్మ మృతి దేహానికి పూలమాలలు వేసి నివాళ్ళుర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి పువ్వాడ ఫౌండేషన్ ద్వారా 5 వేల రూపాయల ఆర్థిక సహయాన్ని మంత్రి పువ్వాడ పీఏ చిరుమామిళ్ల రవికిరణ్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా ఉంటారు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుర్ర భాస్కర్ రావు గారు,గ్రామ సర్పంచ్ మేంటం రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సంగయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాత వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు రామారావు బుచ్చిరావు తదితరులు పాల్గొన్నారు.