విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించేది ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రధాతలుగా నిలవాలి

జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)సెప్టెంబర్ 5:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో మన ఊరు – మన బడి కింద పాఠశాలల అభివృద్ధి,
విద్యార్థులకు మంచి చదువులు బోధించి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేది ఉపాధ్యాయులని ఈ విషయంలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు మార్గదర్శకులని ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించి వారిని భావిభారత పౌరులుగా తీర్చదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని ఈ విషయంలో వారు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకులుగా నిలిచి రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించాలని సమావేశంలో ఆకాంక్షించారు. ఉపాధ్యాయులంటే తనకెంతో గౌరవమని అలాగే సమాజంలో వారికి ఎంతో ఉన్నత స్థానం, గౌరవం ఉంటాయని ఈ వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. ప్రతి ఉపాధ్యాయులు ఇతరులకు మార్గనిర్ధేశకులుగా నిలవాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉపాధ్యాయులుగా ఉన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి అయ్యారని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి వారు అనుకున్న గమ్యాలను చేరుకోవడానికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంటుందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు స్థానం కల్పించడం ద్వారా ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవాన్ని తెలియచేస్తోందని వారి కృషి మరువలేనిదని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలిపేందుకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారని అలాగే గురుకుల ఉపాధ్యాయులకు రెగ్యులరైజ్ చేయడం జరిగిందని ఇది ఎంతో శుభపరిణామమని మంత్రి అన్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మన వూరు మన బడి కింద 179 పాఠశాలలకు రూ.80 కోట్లు వెచ్చించి ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి సమావేశంలో వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడ కూడా ఖాళీలు లేవని అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో ఉండటం జరిగిందన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దీంతో పాటు మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే విద్యారంగంలో, చదువులో, ర్యాంకుల్లో అన్ని విషయాల్లో మొదటి స్థానంలో ఉండటం తనకెంతో ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వికాసానికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రోత్సహించిందని అనేక సంక్షేమ పథకాలు పెట్టి వేల కోట్ల రూపాయలు విద్య కొరకు వెచ్చించిందని వారు తెలిపారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులను తమకు మార్గదర్శకులుగా, స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. ఈ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, గౌరవప్రదమైందన్నారు. విద్యార్థులు సైతం తమకంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానిని సాధించేందుకు కృషి చేస్తే అందుకు ఉపాధ్యాయుల తోడ్పాటు తప్పకుండా లభిస్తుందని వారి ద్వారానే అనుకున్న లక్ష్యాలను సాధించడానికి వీలవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిపై మరింత బాధ్యత పెరుగుతుందని వారు ఇతరులకు దిక్సూచిగా నిలవాలని జడ్పీ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
అడిషనల్ కలెక్టర్ విజయేందర్రెడ్డి, మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతుందని,ఇది సర్వేపల్లి రాధాకృష్ణ 136వ జయంతి సందర్భంగా వారి జన్మదినం, ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.
జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అనేక పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యాభివృద్ధికి కృషి చేసిందని తెలిపారు. ఉపాధ్యాయులు పిల్లలను చదువులో ఆణిముత్యాలుగా తయారు చేస్తునారు అని తెలిపినారు ఉత్తమ ఉపాధ్యాయుల సేవలు ఎన్నటికీ మరువలేమని ఆమె అన్నారు.
అనంతరం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎంపికైన 64 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను అందచేసి శాలువా, జ్ఞాపికలు, పూలమాలలతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking