జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి:బాసర రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌నాలెడ్జ్ టెక్నాలజీస్ ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్‌ను మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి , జి.మధుసూదన్ రెడ్డి , వాకిటి శ్రీహరి , జనంపల్లి అనిరుధ్ రెడ్డి , చిట్టెం పర్ణికా రెడ్డి , తూడి మేఘా రెడ్డి , వీర్లపల్లి శంకర్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిశారు.