బి.సి.ఎన్ ఛానెల్ రిపోర్టర్ గడ్డం ప్రశాంత్ కుమార్ ను పరామర్శించిన జర్నలిస్ట్ యూనియన్ నేతలు

 

తూప్రాన్, మార్చి, 28. ప్రజా బలం ప్రతినిధి.

తూప్రాన్ పట్టణానికి చెందిన ప్రజా బలం, బి.సి.ఎన్ రిపోర్టర్ గడ్డం ప్రశాంత్ కుమార్ ఇటీవల హనుమాన్ మాల వేసుకున్న రోజే భోజనం చేస్తూ ఫిట్స్ వచ్చి వెనుకకు పడిపోవడం తో రెండు కాలర్ బోన్స్ విరిగిపోయి స్పృహ కోల్పోగా హుటాహుటిన 108 అంబులెన్స్ వాహనంలో మొదటగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి వైద్యుల సలహా మేరకు కొంపల్లి లోని సాయి సిద్ధార్థ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించి నాణ్యమైన చికిత్స అందించారు. రెండు కాలర్ బోన్స్ కి శస్త్రచికిత్స సర్జరీ చేశారు. కాగా శుక్రవారం మెదక్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుడ్డ భాగ్యరాజు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సి.ఆర్, సీనియర్ జర్నలిస్ట్ లు ఆర్.శివ శంకర్ గౌడ్, గైనిబైటి భాస్కర్ గౌడ్, ఎన్.వెంకటేష్ లు పరమార్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సాయి సిద్ధార్థ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడారు. గడ్డం ప్రశాంత్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking