చలివేంద్రాలను ప్రారంభించిన దారం వేణుమాధవ్‌

రాజేంద్రనగర్‌ ప్రజాబలం ప్రతినిధి:  శనివారంనాడు మణికొండలో పైపులైన్ రోడ్ లో దిలీప్ సూపర్ మార్కెట్ దగ్గర AVOPA పుప్పాలగూడ శాఖ అధ్యక్షుడు దారం వేణుమాధవ్  ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మణికొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్, మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ మీనా ముత్యాలు, AVOPA రాష్ట్ర అధ్యక్షులు మళ్లీపెద్ది శంకర్, AVOPA రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీధర్ పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మలిపెద్ది శంకర్ గారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎప్పుడూ సమాజానికి సేవ చేయడంలో ముందు ఉంటారు, మానవసేవయే మాధవసేవ భావిస్తూ ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం పేర్కొనడం జరిగింది.

మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ చైర్మన్ మరియు మాజీ వైస్ చైర్మన్ గారిని విన్నవిస్తూ ముఖ్యంగా మణికొండలో మా ఆర్యవైశ్య కుటుంబాల కోసం 500 గజాలు ప్రభుత్వం తరఫునుంచి భూమి ఇప్పిస్తే మేము అక్కడ నుంచి వాసవి మాత అమ్మవారికి పూజ చేస్తూ ప్రజలకు కావలసిన ధర్మకార్యాలు నెరవేరుస్తూ మరీ ముఖ్యంగా ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్నటువంటి ఇంజనీర్ డాక్టర్లకు ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తాము అని విన్నవించడం జరిగింది.

ఇట్టి విషయానికి స్పందిస్తూ మాజీ చైర్మన్ కస్తూరి నరేంద్ర గారు మరియు మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు ఆర్యవైశ్యులు చేసేటువంటి ఏ ధర్మకార్యానికైనా మా వంతుగా సహకారం అందిస్తామని తెలియజేస్తూ వాళ్లడినటువంటి 500 గజాలను ప్రభుత్వంతో మాట్లాడి మేము రాజకీయాల కతీతంగా అన్ని పార్టీలతో కలిసి మేము ఒప్పించి ఇస్తాము అని మాట ఇవ్వడం జరిగింది.
AVOPA రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర గారు అడిగిన వెంటనే స్పందించినటువంటి మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అక్కడికొచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులందరూ కరతాల ధనులతో వారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.

ప్రభుత్వ మాజీ ఉపాధ్యాయుడు దారంమల్లయ్య, సాయిరాం, కృష్ణ , రాములు, సాయిబాబా, మణికంఠ, విక్రమ్, బాలరాజు, భానుచందర్, యుగంధర్, స్రవంతి, సంయుక్త మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking