హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 30
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు సౌడమల్ల యోహన్ ఆధ్వర్యంలో జమ్మికుంట తహసిల్దార్ గట్ల రమేష్ బాబుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మాకు నిలువ నీడ లేక అద్దె ఇళ్లలో నానా ఇబ్బందులు పడుతున్నామని, ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై సంపూర్ణమైన నమ్మకం ఉందని, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ నివేషణ స్థలాలు అందించాలని తహసిల్దార్ ను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మార్వో రమేష్ బాబు వారి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భూపతి సంతోష్, జిల్లా సహాయ కార్యదర్శి దొడ్డ రాజేంద్రప్రసాద్, హుజురాబాద్ డివిజన్ కార్యదర్శి ఏబూషి సంపత్, సహాయ కార్యదర్శి ఖాజా ఖాన్, రవికృష్ణ రచ్చ, నాగపురి రాజు తదితరులు పాల్గొన్నారు.