శ్రీ వచ సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్
జనవరి 30:

మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మందమర్రి అంగడి బజార్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి శ్రీవచ సేవా సంస్థ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వచ సేవా సంస్థ అధ్యక్షులు ఉప్పలంచి చంద్రకాంత్ మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారతజాతి ముద్దుబిడ్డ, స్వతంత్ర సమరయోధుడు బ్రిటీష్ వలస పాలనను తన సత్యాగ్రహ ఆయుధంతో ఉధ్యమించి స్వాతంత్ర సమపార్థన చేసి భారతీయులందరికీ స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా చేసిన మహనీయుడు. మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తి మన దేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీవచ సేవా సంస్థ సభ్యులు కె.మధుకర్, రామునూరి రాజేష్, వ్యాపారస్తులు కె.గంగాజి, లెక్చరర్ నోముల చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking