కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 23
కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే తిరుపతి, కే బాపూరావు లు డిమాండ్ చేశారు. సోమవారం టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో,చానలల్లో రిపోర్టర్లుగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారన్నారు. అందులో చాలామంది పేదరికంతో ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని, కనీసం సొంత ఇల్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సొంత ఇల్లు లేని జర్నలిస్టులకు అద్దె చెల్లించడం భారంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, నివేసిన స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వెంటనే నివేశణ స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రాజు, చెట్ల శంకర్, రమణ, లావణ్య, దొడ్డ రాజేంద్రప్రసాద్, ఖాజాఖాన్, లక్కం సురేష్,రమేష్, విజయ్ కుమార్, సుదర్శన్ రెడ్డి, రవీందర్, నీల రాజు, కొమ్ము గణేష్, తిరుపతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
