టీబీజీకేఎస్ డీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణం అయినందునే అధికారులు నీబంధనల ప్రకారం కుర్చి వేశారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
టీబీజీకేఎస్ డీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణం అయినందునే అధికారులు నీబంధనల ప్రకారం కుర్చి వేశారని
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 23 : మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని టీబీజీకేఎస్ నాయకుడు ఢీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణం అయినందునే అధికారులు నిబంధనల ప్రకారం కూల్చివేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సోమవారం ఆయన తన నివాస గృహంలో మీడియా తో మాట్లాడారు.మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు.బీఆరెస్ ప్రభుత్వ హయాంలోనే భవనం ప్రభుత్వ భూమిలో ఉందని అప్పటి తహసీల్దార్ నోటీసులు జారీ చేసారని అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.బీఆర్ఎస్ నేతల అక్రమాలకు దివాకర్ రావు కొమ్ముకాషారని ఆరోపించారు.మున్సిపల్ లో ఉద్యోగాలు పెట్టిస్తానని కౌన్సిలర్ హరికృష్ణ డబ్బులు తీసుకుని పని పెట్టించక పొగ డబ్బులు తిరిగి ఇవ్వలేదని అందుకే బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకున్నారన్నారు.బేర సత్యనారాయణ పై అనేక ఫిర్యాదులు ఉండగా బాధితుల పక్షాన నిలవకపోగా దివాకర్ రావు రోడ్లపై ఆందోళన చేయడం శోచనీయమని అన్నారు.లక్షెట్టిపేటలో ముత్తె సత్తయ్య,దండేపల్లి లో హరినాయక్ అనే బిఆర్ఎస్,బీజేపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని అభియోగించారు.
తప్పు ఎవరు చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. తాను ప్రజల పక్షాన ఉంటాను తప్ప తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వమని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాలలో ట్రాఫిక్ నియంత్రణ,ప్రజల సౌకర్యం కోసం కొంత కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పడం లేదని అన్నారు.మంచిర్యాలలో గంజాయి అమ్మకం, సేవించడాన్ని తాను తీవ్రంగా పరిగనిస్థానని అన్నారు.గంజాయి ఆనవాళ్లు మంచిర్యాలలో కనిపించవచ్చ వద్దని పోలీస్ లను ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు.స్వపక్షం,విపక్షం అనే భేదం లేదని గంజాయి కేసులో ఎవరు పట్టుబడిన చట్ట పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.రాత్రి యువకులు బయట తిరగవద్దని సూచించారు. మాతా,శిశు ఆసుపత్రికి అనుమతి మంచిర్యాల ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణంకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.కొద్దీ రోజుల్లో నిర్మాణం పనులు చేపడు తామని ఆయన పేర్కొన్నారు.ఈ ఆయన వెంట జిల్లా నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, దండేపల్లి,లక్షెట్టిపేట, హాజపూర్,మంచిర్యాల, మండల నాయకులు, పట్టణ నాయకులు, మంచిర్యాల పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.