భగత్ సింగ్ అసోసియేషన్ సభ్యులపై కేసు…

 

వినాయక నిమజ్జన యాత్ర చేయుచున్న వారు గొడవపడి దాడి చేసి కొట్టినారాని ఫిర్యాదు..

మెదక్ జిల్లా ఎస్, పి,
డీ. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పీ.ఎస్

ప్రజాబలం దినపత్రిక
మెదక్ / శివంపేట్
23,09,2024:

సోమవారం జిల్లా ఎస్.పి. .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. శివంపేట పోలీస్ స్టేషన్ పరిది గోమారం గ్రామంలో నిన్న తేదీ: 22.09.2024 నాడు రాత్రి జరిగిన భగత్ సింగ్ అసోసియేషన్ వారి వినాయక నిమజ్జన కార్యక్రమంలో వినాయక నిమజ్జన మండలి వారు వినాయక నిమజ్జన యాత్ర చేయుచూ నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మా రెడ్డి గారి నివాస ప్రాంతం వద్ద టపాకాయలు కాల్చగా ఇంట్లో నుండి కొందరు వ్యక్తులు వచ్చి వారిని ఇక్కడ టపాకాయలు కాల్చవద్దు అని అనగా భగత్ సింగ్ అసోసియేషన్ వినాయక నిమజ్జన యాత్ర చేయుచున్న వారు గొడవపడి దాడి చేసి కొట్టినారాని ధరఖాస్తు ఇవ్వగా ఈ రోజు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి తదుపరి బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఏవైనా గొడవలు జరిగినప్పుడు సంయమనం పాటించాలని డయల్ 100 కి కానీ దగ్గరలోని పోలీస్ వారికి సమాచారం అందించాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking