గ్రామంలో రోడ్లపై ప్రమాదంగా ఉన్న గుంతలు పూడ్చివేత

 

గ్రామ పంచాయతీ కార్యాలయం చల్మెడ

ప్రత్యేక అధికారి ఎంపిడిఓ రాజు రెడ్డి

గ్రామ పంచాయతీ సెక్రెటరీ
వెంకట నరసింహారెడ్డి

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా నిజాంపేట మండలం
23,09,2024:

మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ కషీరు నుండి
కోట గడ్డ మైసమ్మ టెంపుల్ వద్ద వరకు ఉన్నటువంటి సీసీ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు ఎవరు పట్టించుకోకపోవడంతో రోడ్డు గుంతలు పడి వర్షాలు పడితే ప్రాణాలకు ప్రమాదంగా మారింది గత కొన్ని రోజుల కింద కురిసిన వర్షానికి రోడ్డు గుంతలు కావడంతో ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారింది. గ్రామపంచాయతీ కార్యాలయం వెంటనే ఈ రోడ్డుపై దృష్టి పెట్టి చల్మెడ గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీవో రాజిరెడ్డి ఆధ్వర్యంలో తాత్కాలికంగా గుంతలు పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సెక్రెటరీ వెంకట నరసింహారెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ రోడ్డు చిన్న వర్షం పడిన గుంతలు బాగా ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బంది కలగడం వలన ఇకముందు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరమ్మతుల కోసం రోడ్డుపై ఉన్న గుంతలను కూల్చడం జరిగిందని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking