జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

 

బీఎస్పీ ఖమ్మం నియోజకవర్గం ఇంచార్జ్ అయిత గాని శ్రీనివాస్ గౌడ్

ఖమ్మం ప్రతినిధి జూన్ 21 (ప్రజాబలం) ఖమ్మం జర్నలిస్టులకు 23 ఎకరాల రెండు కుంటల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ భూమిని చదును చేయడం లేదు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదని ఖమ్మం బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ అయిత గాని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నిన్న ఖమ్మం వెలుగుమట్లలోని జర్నలిస్టులకు కేటాయించిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఐదు ఎకరాలు భూమి కేటాయించారని బిఎస్సి దానిపై డిమాండ్ చేసిన తర్వాతనే 23 ఎకరాల రెండు కుంటలు భూమి జర్నలిస్టులకు కేటాయించారని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు పట్టాలు పంపిణీ చేస్తానని ప్రకటించిన మంత్రి ఇప్పటివరకు ఎలాంటి కార్యచరణ చేయలేదని అన్నారు వారంలోగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయకపోతే బిఎస్పి పార్టీ తరఫున కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో అక్రిడేషన్ కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలం మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళిత బహుజన జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా నాయకులు చేకూరి చైతన్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking