– దాడికి పాల్పడ్డ దోషులను అరెస్ట్ చేసి, శిక్షించాలి
జిల్లా టియుడబ్ల్యూ జేయు (ఐజేయు) అధ్యక్షులు శ్రీనివాస్ రావు.
జగిత్యాల, మార్చి 14,(ప్రజాబలం ప్రతినిధి) జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించడంతో పాటుగా, జర్నలిస్ట్ ల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని జిల్లా టియు డబ్ల్యూ జేయు (ఐ జే యు) అధ్యక్ష, కార్యదర్శి చీటీ శ్రీనివాస్ రావు, మోరపల్లి ప్రదీప్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పెల్లి మండల కేంద్రంలో ఆంధ్రజ్యోతి టౌన్ రిపోర్టర్ వేణుగోపాల్ రావు పై దుండగులు జరిపిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసన, ధర్నాలకు పిలుపునిచ్చిన జిల్లా కమిటీ, జిల్లా వ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్ చౌరస్తా లో ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయం లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. అనంతరం శ్రీనివాస్ రావు, ప్రదీప్ కుమార్ లు మాట్లాడుతూ జర్నలిస్ట్ వేణు పై జరిగిన దుండగుల దాడిని జిల్లా యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్ట్ లపై దాడులు చేయడం దురదృష్టకరం అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ల హక్కుల కోసం పోరాడుతూనే, జర్నలిస్ట్ ల రక్షణ కోసం పోరాటం చేయడంలో టియు డబ్ల్యూ జేయు (ఐ జే యు) ముందుంటుందన్నారు. జర్నలిస్ట్ ల హక్కుల సాధన, సంక్షేమమే ఏజెండాగా ముందుకు సాగుతున్న తరుణంలో ఒక విలేకరిపై దుండగులు దాడి చేయడం విచారకరం అన్నారు. బాధితుని పక్షాన అండగా నిలవాల్సిన పోలీసులు 60గంటలు గడిచిన కేవలం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయకుండా చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. వెంటానే దాడికి పాల్పడిన దుండగులను అరెస్ట్ చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్త ఆందోళనకు యూనియన్ పక్షాన సిద్ధం అవుతామన్నారు. రాష్ట్రంలో జర్నలిస్ట్ ల పరిస్థితి దారుణంగా మారిందని, జర్నలిస్ట్ లపై దాడులు, ఛానల్, పత్రికాలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి సంస్కృతి కాదని, దాడులకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు గైకొంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. అవసరమైతే జర్నలిస్ట్ ల రక్షణ కోసం ప్రత్యేకంగా జర్నలిస్ట్ ల రక్షణ చట్టం తేవాలని వరుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రిపోర్టర్ వేణుపై దాడి చేసిన దుండగులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి బిజెపి బాధ్యులు ముదుగంటి రవీందర్ రెడ్డి, ఏసీఎస్ రాజు, బిట్టు, బిసి సంఘం ప్రతినిధులు ముసిపట్ల లక్ష్మి నారాయణ, సీపతి రమేష్ లు సంఘీభావం ప్రకటించి, ఘటనను ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ యూనియన్ సంఘం బాధ్యులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.