మంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు లక్షెట్టిపెట పర్యటన సందర్భంగా లక్షెట్టిపేట బీజేపీ నాయకులను తెల్లవారు జామున అక్రమ అరెస్టులు హేయమైన చర్య,బిఆర్ఎస్ నాయకులు ప్రైవేట్ ఆసుపత్రుల తో కుమ్మక్కై లక్షెట్టిపేటలో 100 పడగల ఆసుపత్రి ని 30 పడకల ఆసుపత్రిగా మార్చారు.దీని వల్ల లక్షెట్టిపేట, దండేపల్లి,జన్నారం,హజీపుర్ మండలాలలో పేద ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది,మంత్రి హరీష్ రావు రెండు సంవత్సరాల క్రితం అసెంబ్లీలో హామీ ఇచ్చినట్టుగా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు ఇప్పటి వరకు మర్చలేదని,దీని వల్ల రైతులు నష్టోతున్నారు అని అన్నారు,దండేపల్లి,లక్షెట్టిపేట, హాజిపుర్,మండలాల్లో 10 వేలకు పైగా ఎండి పోయే పరిస్థితి వచ్చిందని ఆన్నారు,నష్టపోయిన రైతులకు ఎకరానికి 25వేల నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు,అక్రమ అరెస్టు బీజేపీ నాయకులు బయపడరని అన్నారు,రైతులకు న్యాయం జరిగేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని అన్నారు.అరెస్టయిన వారిలో మున్సిపాలిటీ అధ్యక్షుడు విరమళ్ల హరి గోపాల్ రావు,కిసాన్ మోర్చ రాష్ట్ర నాయకులు తమ్మినిడి శ్రీనివాస్,బుద్దె లక్ష్మణ్,జిల్లా కార్యవర్గ సభ్యులు వేముల మధు,బీజేపీ నాయకులు గొల్ల రాజేష్,చాతరాజు శివశంకర్, మోటపలుకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking