బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతి రావు బాబు పూలే జయంతి వేడుకలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో జ్యోతి రావు బాబు పూలే జయంతి కార్యక్రమాన్ని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది, మంగళవారం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోపతి రాజయ్య మాట్లాడుతూ… జ్యోతి రావు బాబు ఫూలే సామాజిక ఉద్యమకారుడు,సంఘసంస్కర్త, బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు.సమాజంలో అనిచి వేతకు, ఆరాచకాలకు వ్యతిరేకంగా సత్య శోధక సంస్థను స్థాపించి దేశ వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప శక్తి అని అన్నారు. అంటరానితననికి,వ్యతిరేకంగా విద్యావ్యాప్తికి, విశేష కృషి చేసిన వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలే ఆశయాల సాధన కోసం అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు,జ్యోతిరావు పూలే కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు తో సమచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల ఇన్చార్జి గుండా ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి బందెల రవిగౌడ్, మండల ఉపాధ్యక్షులు సీపిరిశెట్టి శ్రీనివాస్ కన్నెపల్లి ఉపసర్పంచ్ దుమ్మని సత్తయ్య దండేపల్లి మండల కోశాధికారి గుండా రవీందర్,ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బోర్లగుంట వెంకటేష్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వనపర్తి రాకేష్ మేదరిపేట శక్తి కేంద్ర ఇంచార్జ్ ముత్తినేని మల్లేష్,శెంకర్,రవి, కూడికందుల బామేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking