జన తెలంగాణ యూత్ ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే జయంతి

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 (ప్రజాబలం) ఖమ్మం మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి వేడుకలను నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ సమీపంలో గల ఆయన విగ్రహం వద్ద జన తెలంగాణ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యూత్ క్లబ్ అధ్యక్షులు కందుకూరి మహేష్, కార్యదర్శి మొఘపోతుల హర్షవర్ధన్, సలహాదారులు కంబాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాడు భారతదేశంలో బడుగు,బలహీన వర్గాలవారిపై కులవివక్షత ఎక్కువగా ఉండేదని, ఆ కులవివక్షత, అంటరానితనం రూపుమా పూటకు జ్యోతి రావు ఫూలే ఎంతగానో కృషి చేశారని అన్నారు. జ్యోతిబాఫూలే ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకుసా గాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో కంబాల శివాజీ, సాయికిరణ్, కందుకూరి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking