కాకతీయ మెడికల్ కాలేజీ, పీజీ వైద్య విద్యార్థిని, ధారావత్ ప్రీతికి, ఘన నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
ఖమ్మం ప్రతినిధి మార్చి01 (ప్రజా బలం) ఖమ్మం
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, ప్రజాసంఘాల,ఐక్యవేదిక ఆధ్వర్యంలో,ఖమ్మం నగరం స్థానిక,పెవిలియన్ గ్రౌండ్ పూలే దంపతుల ప్రాంగణం వద్ద, కొవ్వొత్తులతో, నిరసన ర్యాలీ, నిర్వహించారు, ఈ సందర్భంగా, ఐక్యవేదిక చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు కన్వీనర్ గుంతేటి వీరభద్రయ్య, మాట్లాడుతూ, డాక్టర్ ప్రీతి మరణం ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వ హత్య అని,ఈ ఘటనపై,వెంటనే సెట్టింగ్ జడ్జితో, న్యాయ విచారణ జరిపించాలని, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, హెచ్ ఓ డి, సంబంధిత పోలీస్ అధికారులను, తక్షణమే డిస్మిస్ చేయాలని, డిమాండ్ చేశారు, మరియు ప్రీతి కుటుంబానికి అన్ని విధాలుగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అండగా ఉండాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగకుండా, దిశా చట్టం లాగా ప్రీతి చట్టాన్ని అమలు చేయాలని, కళాశాలలో ర్యాగింగ్లకు అరికట్టాలని, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, బహుజన పక్షాన ఉన్నామనే, సంకేతాన్ని, పంపించాలని, ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేసినారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఇటువంటి మరణాలను ప్రోత్సహిస్తుందని, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఆవేదన వ్యక్తం చేసినారు ఈ కార్యక్రమంలో, ఐక్యవేదిక కోకన్వీనర్లు, బానోత్ బద్రునాయక్, షేక్ అబ్దుల్ రహమాన్,పెరుగు వెంకటరమణ, ఆర్.పి.ఐ పార్టీ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల, ఇంచార్జ్ నకరికంటి సంజీవరావు,ఐక్యవేదిక నాయకులు, దాసరి శీను,అడ్వకేట్ నజీమా, ఉపేంద్ర, చంద్రశ్రీ, రమ్య, గుండెపోగు అఖిల్,శంకర్, పర్వాతమ్మ,మంగమ్మ, సైదాబీ, శ్రీనివాస్ నాయక్, శంకర్ నాయక్, రాంబాబు నాయక్, జంగిపల్లిరవి,ఆనంద్, తదితరులు పాల్గొన్నారు