చందూ క్లిక్ కి జాతీయ బహుమతి

 

 

అభినందించిన తుంబూరు దయాకర్ రెడ్డి

 

ఖమ్మం ప్రతినిధి మార్చి01(ప్రజా బలం) ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ చందూ కి జాతీయ స్థాయి పురస్కరం లభించింది. వనపర్తి ఫొటొగ్రఫీ సోసైటీ వారి ఆధ్వర్యంలో పాపికొండల ప్రాంతంలో జాతీయస్థాయి వర్క్ షాప్  నిర్వహించారు. రెండురోజులపాటు జరిగిన ఈ  వర్క్ షాప్ లో  వివిధ రాష్ట్రాలకు చెందిన 35 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన కొమ్ము, కోయ నృత్యాలు, మత్సకారుల జీవనశైలీపై  వర్క్ షాప్  జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన స్పాట్ ఫొటో  కాంపిటీషన్ లో చందూ తీసిన చిత్రానికి బంగారు పతకం లభించింది. బండి రాజన్ బాబు  మెమోరియల్ గోల్డ్ మెడల్ పేరుతో ఈ బహుమతిని నిర్వాహకులు చందూకి అందజేశారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన చందూని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking