కళ్యాణ చక్రవర్తి ది ముమ్మాటికి హత్యే..?

 

న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం

టూ టౌన్ పోలీసుల నిర్లక్షవైఖరి

తాము చెప్పినట్టే పిర్యాదు రాయాలంటూ సిఐ వత్తిడి

విలేకరుల సమావేశంలో మృతిని బంధువులు ఆవేదన

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం మా కుమారుడు కళ్యాణ చక్రవర్తి ది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్యేనని మృతిని తండ్రి మల్లినేని ప్రసాద్, బాబాయిలు మల్లినేని భాస్కర్, వెంకటేశ్వర్లు, మామయ్య వెంకటనారాయణ ఆరోపించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మల్లినేని కళ్యాణ్ చక్రవర్తి (29) గతంలో ఖమ్మంలో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో తన స్నేహితులకు అప్పుగా డబ్బులు ఇచ్చాడన్నారు. ఈనెల 15న ఇందిరానగర్లో గతంలో తాను కిరాయి కున్న రూమ్ దగ్గరకు డబ్బుల వసూళ్లకు వెళ్లి అడిగినప్పుడు ఇద్దరు బుల్లెట్ పై బెదిరించారని కొందరు స్థానికులు చెప్పారని ఆరోపించారు. ఖమ్మం వచ్చిన కళ్యాణ్ చక్రవర్తి సాయంత్రం 4:15 గంటలకు కనస్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ మీద నుండి పడి చనిపోతే రాత్రి 7:45 కి పోలీసులు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని అన్నం శ్రీనివాసరావు ద్వారా మార్చురుకి తరలించారన్నారు. కానీ మృతుని తెల వెంట్రుకలు గోడపై అతికి ఉన్నాయని, రెండు కాళ్లు, చేయి విరిగిపోయి ఉన్నప్పటికీ ఆత్మహత్యగా సృష్టిస్తున్నారని బాధను వ్యక్తం చేశారు. కళ్యాణ్ చక్రవర్తి ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని అప్పు తీసుకున్న వారి నుండి డబ్బులు వసూలు చేయడానికే ఖమ్మం వచ్చాడని అన్నారు. ఖమ్మం టూ టౌన్ లో ఆత్మహత్య కాదు ఇది హత్య అని ఫిర్యాదు చేయటానికి వెళితే అక్కడ సీఐ నేను చెప్పినట్టుగా ఫిర్యాదు రాసిస్తేనే తీసుకుంటామని చెప్పి ఫిర్యాదు తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎటువంటి విచారణ చేపట్టలేదని, మృతుని ఫోన్ కాల్ ఆధారంగా విచారం జరపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. తాము ఎంతటి న్యాయ పోరాటానికి సిద్ధమని, జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking