జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 23
జమ్మికుంట పట్టణంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సోమవారం మహిళా సంఘా సభ్యులు, మునిసిపల్ అధికారులు వార్డు ప్రజలతో కలిసి పాత మున్సిపల్ ఆఫీస్ ఏరియా లో రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా మునిసిపల్ హెల్త్ అసిస్టెంట్ మహేష్ మాట్లాడుతూ చెత్తను రోజు వారిగా మన ఇంటికి వచ్చే మునిసిపల్ వాహనానికి అందించాలని, మీ ఇంటి ముందు ఉన్న రోడ్లపై కానీ ఇంటి పరిసరాలలో చెత్త వేయకూడదని తగు సూచనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్, మహిళా సంఘ సభ్యులు, వార్డు ప్రజలతో పాటు తదితరులు పాల్గొన్నారు.