కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం పేద, నిరుపేదల సంక్షేమమే పరమా వదిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి గడపకు నేరుగా అందుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలో కళ్యాణలక్ష్మీ, షాది ముభారక్‌ పథకం ద్వారా మంజూరైన 105 మంది లబ్ధిదారులకు శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేె.చంధ్రశేఖర్‌రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టి నిరంతరాయంగా అమలు చేస్తున్నారన్నారు. పథకంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారం తగ్గిందన్నారు. ఖమ్మం నగరం పరిధిలో-59, రఘునాధపాలెం -46 మొత్తం 105 చెక్కులకు గానూ రూ .1.05 కోట్లు పంపిణి చేశారు.
కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ విజయ్‌ కుమార్‌, కార్పొరేటర్లు కమవర్తపు మురళి, గజ్జెల లక్ష్మీ, దొన్వాన్‌ సరస్వతి, పాకాలపాటి విజయ, దాదే అమృతమ్మ, ప్రశాంతి లక్ష్మీ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరి ప్రసాద్‌, టౌన్‌ అద్యక్షుడు పగడాల నాగరాజు, సిటీ లైబ్రరీ చైర్మన్‌ ఆశ్రీఫ్‌, రుద్రగాని ఉపేందర్‌, యర్రా అప్పారావు, ఆళ్ళ అంజిరెడ్డి, మాటేటి నాగేశ్వర రావు, బోజెడ్ల్‌ రాం మోహన్‌, ఖమ్మం, రఘునాథ పాలెం తహసీల్దార్‌లు స్వామి,విల్సన్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking