కొల్లాపూర్, సెప్టెంబర్ 16విశ్వగురు అని చెప్పుకునే మోదీ.. 9 ఏళ్లుగా మన నీళ్ల వాటా తేల్చలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ దుయ్యబట్టారు. 10 ఏళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలి అని అన్నారు. దత్తత తీసుకున్న సీఎంలు కూడా ఈ జిల్లాలకు చేసిందేమీ లేదని విమర్శించారు.నాగర్‌కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్?లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల చరిత్రలో ఇవాళ సువర్ణాక్షర లిఖితమని పేర్కొన్నారు. పాలమూరు ప్రజలంటే ఒక్కప్పుడు ముంబయి, హైదరాబాద్‌లో అడ్డా కూలీలుగా పేరు అని.. ఇవాళ తెలంగాణ ప్రజలే ఇతర రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని గుర్తు చేశారు. కొందరు నేతల వల్లే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వివరించారు. గత పాలకులు పాలమూరు జిల్లా నీటి వాటా గురించి ఎప్పుడూ అడగలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో నా తొలిపాదయాత్ర జోగులాంబ గద్వాల నుంచే చేశానని పేర్కొన్నారు. ఇంటిదొం గలే మనకు ప్రాణగండం తెచ్చారని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డితో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 1200పైగా గ్రామాలకు తాగునీరుపదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. మనం ఎత్తులో ఉన్నాం నీళ్లు రావని.. ఈ జిల్లా నేతలే మాట్లాడారని గుర్తు చేశారు. మన నీళ్లు ఏపీకి తరలివెళ్తుంటే ఈ జిల్లా నేతలు జెండాలు ఊపారని విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే మోదీకి చేతకావటం లేదని మండిపడ్డారు. విశ్వగురు అని చెప్పుకునే మోదీ.. 9 ఏళ్లుగా మన నీళ్ల వాట తేల్చలేదని ధ్వజమెత్తారు.
10 ఏళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలను పాలమూరు జిల్లా ప్రజలు నిలదీయాలని అన్నారు. దత్తత తీసుకున్న సీఎంలు కూడా ఈ జిల్లాలకు చేసిందేమీ లేదని పేర్కొ న్నారు. పాలమూరు ప్రాజెక్టుపై ఈ జిల్లా నాయకులే కేసులు వేశారని ఆరోపించారు. చేతనైతే కమలం నాయకులు.. నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి నీటివాటా అడగాలని డిమాండ్ చేశారు.మొట్టమొదట విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టి అధిగమించామని పేర్కొన్నారు. పింఛన్లు క్రమంగా పెంచుకుంటూ పోతున్నామని చెప్పారు. ఉన్న తెలంగాణను పోగొట్టింది.. కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. 60 ఏళ్లల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు వైద్య కళాశాల వచ్చిందా? అని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ సీఎంలు జిల్లాకొక వైద్య కళాశాల తెచ్చారా? అని పేర్కొన్నారు. తమిళనాడు పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పెడుతున్నారని.. పథకం బాగుందని తెలంగాణ లోనూ అమలు చేయాలని నిర్ణయించామని వెల్లడిరచారు.
తమిళనాడులో ఐదో తరగతి వరకే అల్పాహరం పెడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో పదో తరగతి వరకు అమలు చేయాలని నిర్ణయించామని వివరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు తొలిసారి ఎంతో సంతోషపడ్డానని.. మళ్లీ ఇవాళ పాలమూరు గడ్డపై కృష్ణా జలాలు పారుతుంటే అంత సంతోషం కలిగిందని చెప్పారు. కొల్లాపూర్ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తామని.. ఈ ప్రాంతంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయనున్నట్లు వివరించారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ తో కలిసి పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ,విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి