చేతికి జై కొట్టిన కర్ణాటక గ్రాండ్‌ విక్టరీ సాధించిన కాంగ్రెస్‌

బెంగళూరు, మే 13, (న్యూస్‌ పల్స్‌)కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌కు మించి మెజార్టీ సీట్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.. ఇప్పటికే 137 స్థానాల్లో విజయాన్ని ఖరారు చేసుకున్న ఆ పార్టీ.. మరికొన్ని స్థానాల్లో విజయం ఖాయం అంటోంది.. ఇదే సమయంలో.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష జేడీఎస్‌ రెండూ కలిసినా.. ఏవిూ చేయలేని పరిస్థితి.. ఇంత వరకు బాగానే ఉంది.. ఊహించని మెజార్టీ అందుకున్న కాంగ్రెస్‌ పార్టీలో సీఎం అయ్యేది ఎవరు? గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సిద్ధరామయ్య మరోసారి సీఎం సీటు ఎక్కుతారా? కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ట్రబుల్‌ షూటర్‌గా పేరుపొందిన డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.అయితే, శివకుమారా లేక సిద్ధిరామయ్యా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సిద్ధిరామయ్యే సీఎం అవుతారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కానీ, డీకే శివకుమార్‌కు కూడా ఆ పోస్టు దక్కే ఛాన్స్‌ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో తన హవా కొనసాగిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ 137 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 62 స్థానాలకు పరిమితం అయ్యింది.. ఇక, జేడీఎస్‌ అయితే దారుణంగ దెబ్బతిని 21కే పరిమితం అయ్యింది.. మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపు దిశగా సాగుతున్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రానికి సీఎం అభ్యర్థి ఎవరు? అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. కర్ణాటకలో విద్వేష రాజ్యం ముగిసింది.. ప్రేమతో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను గెలపించారు.. ఇది మనందరి విజయం.. కర్ణాటక ప్రజలకు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, శ్రేణలకు ధన్యవాదులు తెలిపారు.. ఇక, ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించబోతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు రాహుల్‌.. కానీ, కాబోయే సీఎం ఎవురు? అనే విజయాన్ని దాటవేశారు రాహుల్‌ గాంధీ.. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను తొలి కేబినెట్‌లోనే నెరవేరుస్తామని స్పష్టం చేశారు రాహుల్‌.మరోవైపు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప తీర్పు ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్‌ ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో హావిూ ఇచ్చినట్టుగానే తాము అధికారం చేపట్టగానే అన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. పార్టీ గెలుపు కోసం సోనియా, రాహుల్‌, ప్రియాంక తమవంతు కృషి చేశారని, సోనియాగాంధీ ఆరోగ్యం బాగాలేకపోయినా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, వాళ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఖర్గే చెప్పుకొచ్చారు.. అయితే, కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం కూడా సీఎం అభ్యర్థి ఎవరు? అనే విషయంలో స్పందించడంలేదు.. అంతర్గతంగా చర్చించన తర్వాతే సీఎల్పీ నేతలను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం..
ట్రెండ్‌ ఫాలో అయ్యారు…
కర్నాటక ఫలితాలు చూస్తుంటే 38 ఏళ్ల ట్రెండ్‌ను కన్నడ ఓటర్లు కొనసాగిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి అధికారం అప్పగించకూడదన్న సంప్రదాయం ఈ ఎన్నికల్లోనూ కనిపించింది. 2018 ఫలితాలతో పోల్చితే ఈసారి కన్నడ ఓటర్లు విస్పష్టమైన తీర్పు ఇచ్చినట్టు ట్రెండ్స్‌ కనబడుతున్నాయి. బరిలో 16 పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం ఎప్పటిలాగే మూడు ప్రధాన పోటీలు ? కాంగ్రెస్‌, బీజేపీ, ఏఆూ మధ్యే కనిపించింది. ఒకసారి స్పష్టమైన మెజార్టీ, మరోసారి హంగ్‌ తీర్పు ఇచ్చే కన్నడ ఓటర్లు ఈ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్‌ చూపారు.రిజల్ట్స్‌ ట్రెండ్స్‌ చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ ఈజీగా 135 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ 43 శాతం ఓట్లు సాధించింది. ఇక 1985 తర్వాత ఇంత వరకు కర్నాటకలో అధికారంలో ఉన్న పార్టీ తిరిగి అధికారాన్ని చేపట్టకపోవడం సంప్రదాయంగా మారింది. ఈసారి ఈ చరిత్రను తిరగరాసేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. కాని కర్నాటక ఓటర్లు తమ సంప్రదాయాన్ని మార్చుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారుఇదిలా ఉంటే వాస్తవానికి దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్నాటకలో ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. కానీ, తమిళనాడు ఓటర్లు గతంలో వరుసగా రెండుసార్లు జయలలిత నాయకత్వంలో అన్నాడీఎంకేని గెలిపించి సంప్రదాయాన్ని తిరగరాశారు. అలాగే కేరళ ఓటర్లు కూడా వరుసగా రెండుసార్లు ఒఆఈను గెలిపించి కొత్త ట్రెండ్‌ సృష్టించారు. ఈ క్రమంలో కర్నాటకలోనూ కొత్త సంప్రదాయం మొదలు కావచ్చని కొత్త మంది ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. కాని, కన్నడ ఓటర్లు మాత్రమే తమ పాత సంప్రదాయనికే మొగ్గు చూపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking