రాజేంద్ర నగర్ ప్రజా బలం 17 నవంబర్ 2024
వివేక భారతి యోగ శాఖ ఆద్వర్యంలో కార్తీక వన భోజనాల కుటుంబ సమ్మేళనం సందర్భముగా మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని ఖాజగుడ ల్యాంకో హిల్స్ పెద్ద గుట్టలో గల అనంత పద్మనాభ స్వామి ఆలయ ప్రాంగణంలో గోపూజ, తులసి, ఉసిరి చెట్ల ఇత్యాది పుజలానంతరం పూర్ణ వందే మాతరం ఆలాపన, మలిపెద్ది శంకర్ ద్వారా ఆధ్యాత్మిక కార్తీక మాసo యొక్క ప్రత్యేకతపై ప్రసంగం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము, భోజన మంత్ర పఠనంతో కూడిన సహా పంక్తి భోజనాల తదనంతరం ఆట పాటలతో కూడిన భగవత్ గీత ద్వారా కుటుంబ విలువలపై బాల బాలికలకు విడమరచి తెలియ చేసిన భాలగోకులం సంస్థ ముఖ్య శిక్షక్ అక్కినేపల్లి పవన్ కుమార్, శ్వేతా పవన్ తరువాత భక్తులచే భజనలు, కీర్తనలు, సాంస్కృతిక క్విజ్ పోటీలు మరియు పిల్లలచే శ్లోక పఠనంలు చేయడం జరిగినవని వేదిక సంఘటన సభ్యులు మోహన్ రెడ్డి, హంస్రాజ్, కిరణ్ మట్టేవాడ, రాజు, సత్యనారాయణ మూర్తి, రవి, అనిల్, సాయిబాబా, సాంబశివ రావు, పూర్ణచంద్రరావు, ప్రసాద్, సాయి పట్టపు అందరూ కలపి తెలుపడం జరిగినది, ఇట్టి శుభ తరుణంలో అశేష భక్త జనులు తమ తమ కుటుంబాలతో పాటు వీ ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు సభ్యులు అందె లక్ష్మణ్ రావు, దిలీప్ కక్కడ్, రచ్చ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post