ప్రజాబలం దండేపల్లి మండల రిపోర్టర్ నవంబర్ 27 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలోని హనుమాన్ మందిరం షెడ్ నిర్మాణం కోసం 20 సిమెంట్ బస్తాలు అందించిన కరుకూరి సత్తయ్య బుధవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కొర్విచెల్మ గ్రామంలో హనుమాన్ మందిరం పక్కనున్న నూతన షెడ్ కొరకు హనుమాన్ భక్తులు నా దృష్టికి తీసుకోవడంతో నా వంతుగా హనుమాన్ మందిర షెడ్ కోసం 20 సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది,ఇంకా ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం అందించాలని తెలిపారు.అందించినందుకు గాను వారికి హనుమాన్ భక్త మండలి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గొపతి తిరుపతి,యడపుపు మహేష్,అప్పని సత్తయ్య, ముద్ధసాని పెద్దయ్య,గొపతి కిష్టయ్య,రాజేందర్, హనుమాన్ మందిరం పూజారి సాయి చరణ్, గ్రామం రైతు,హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.