ఆఫీసర్స్ బీ అలర్ట్…!

 

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు

కొత్తగూడెం జిల్లా అధికారులకు మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్

పలు శాఖల అధికారుల పనితీరు పై ఫిర్యాదులొస్తున్నాయ్

పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిక

సీఎస్ఆర్ నిధులు నిర్వీర్యం కాకుండా సీపీవో బాధ్యతయుతంగా వ్యవహరించాలి

పంచాయతీ సెక్రటరీలపై డీపీవో ఎమ్మార్వోలపై ఆర్డీవో పర్యవేక్షణ తప్పనిసరి

అన్ని శాఖల అధికారులను అడిషనల్ కలెక్టర్ సమన్వయం చేసుకోవాలి

కొత్తగూడెం జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షా సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి నవంబర్ 27 (ప్రజాబలం) కొత్తగూడెం తెలంగాణ రెవెన్యూ గృహనిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం జిల్లా అధికారులపై ఫైర్ అయ్యారు. కొత్తగూడెం జిల్లా పర్యటనకు బుధవారం వచ్చిన ఆయన అప్పటికప్పుడు పలు శాఖల అధికారులతో చుంచుపల్లిలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వేటు తప్పదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందడంలో, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలుంటాయన్నారు. పలు శాఖల అధికారులపై ఫిర్యాదులొస్తున్నాయని, అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సీఎస్ఆర్ ద్వారా వచ్చే నిధులు నిర్వీర్యం అవుతున్నట్లు తన దృష్టికి వచ్చింద వాటిని మంచి పనులకు వినియోగించాలని లేకపోతే శాఖపరమైన చర్యలుంటాయని సీపీవోను హెచ్చరించారు.

ఆయా ప్రాంతాల్లో జరిగే రోడ్డు అభివృద్ధి పనులకు అటవీ శాఖ నుంచి అవసరమైన అనుమతులను అలస్యం లేకుండా పొంది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈఈలకు సూచించారు గ్రామాల్లో పనిచేసే వంచాయతీ సెక్రటరీలు నివాసం ఓ చోట విధులు మరో చోట నిర్వహిస్తుండటంతో ఆయా గ్రామాల్లో వారికి పట్టు ఉండటం లేదని వెంటనే ఆయా గ్రామాల సెక్రటరీలు వారు పనిచేస్తున్న గ్రామాలకు నివాసం మారాలని సూచించారు. వారిపై డీపీవో పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు గ్రామాల్లో వీధిలైట్లు మంచినీరు ఇతరత్రా సమస్యలేవీ లేకుండా చూడాలన్నారు. అలాగే జిల్లాలోని పలు మండలాల్లో ఎమ్మార్పోలపై వరుస ఫిర్యాదులందు తున్నాయని తెలిపారు. ఎమ్మార్వోలను పర్యవేక్షించే బాధ్యత ఆర్ డీ వో లదేనని సూచించారు. వారి పనితీరు ఎప్పటికప్పుడు తనకు అప్ డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. వాటి ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో మెరుగైన పనితీరు కోసం ఒక్కరికే రూ.50లక్షల ఆ పై టెండర్లు ఇవ్వాలన్నారు. తద్వారా అతని పై ఒత్తిడి పెంచి పనిని త్వరగా పూర్తి చేయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆర్ డ బ్ల్యూఎస్ అధికారులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలని, ఆకస్మిక తనిఖీ చేస్తానని నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గమనిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటాననిహెచ్చరించారు వరిపాలన సజావుగా సాగేందుకు లోకల్ బాడీస్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకోని విధులు నిర్వర్తించాలన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking