పోటు ప్రసాద్ కు టియుడబ్ల్యుజె(ఐ జె యు) నివాళి

 

నిజమైన కమ్యూనిస్టు వాది పోటు రాంనారాయణ

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ హఠన్మరణం పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టియడబ్ల్యుజె -ఐజెయు) జిల్లా కమిటి తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేసింది.ఈమేరకు యూనియన్ ముఖ్య నాయకులు సిపిఐ జిల్లా కార్యాలయంలోని పోటు ప్రసాద్ భౌతకకాయాన్ని సందర్శించి నివాళ్ళులు అర్పించారు.నిజమైన కమ్యూనిస్టు వాది ,నిష్కలంక పోరాట యోధుడు ,ఉద్యమాలకు మార్గదర్శకుడు పోటు ప్రసాద్ అకాల మరణం కలచివేసిందన్నారు అందరిలో తలలోనాలుకలా వ్యవహరించే పోటు ప్రసాద్ అకాల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని టియుడబ్ల్యుజె (ఐజెయు)రాష్ట్ర కార్యదర్శి కె రాంనారాయణ పేర్కోన్నారు. కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన పోటు ప్రసాద్ విద్యార్ది దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్ని అంచలంచెలుగా సిపిఐ జిల్లా కార్యదర్శి స్దాయికి ఎదిగారని అన్నారు.జర్నలిస్టు సమస్యలపై ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందిస్తూ అండగా ఉండేవారని పేర్కోన్నారునిడారంబరుడు వివాదరహితుడుగా పేరు సంపాదించుకోని రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నారని అన్నారు. కమ్యూనిస్టు సిద్దాంతాలను తు చ తప్పకుండా పాటిస్తూ కార్మిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు. నివాళ్ళులు అర్పించిన వారిలో రాంనారాయణతోపాటు టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు జిల్లానాయకులు నల్లజాల వెంకట్రావ్ మైనోద్దిన్ తాళ్ళూరి మురళీ జనార్దనచారి కళ్యాణ్ చెరుకుపల్లి శ్రీనివాస్,గోసుల నాగేశ్వర్ రావు,బుర్రి శ్రీనివాస్ సీనియర్ పాత్రికేయులు శంకేసి శంకర్ రావు,ఎన్ ఎస్ రావు తుమ్మలపల్లి ప్రసాద్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking