కౌశిక్.. సీఎంను విమర్శించే స్థాయినా నీది?

 

  • – హుజూరాబాద్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ పటేల్ ఫైర్

వీణవంక ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 20

రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి‌ కౌశిక్‌రెడ్డికి లేదని కాంగ్రెస్ యువనేత మద్దుల ప్రశాంత్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన వీణవంక మండలకేంద్రంలో మీడియాతో మాట్లాడారు. తన శక్తితో నేతలందరినీ సమన్వయం చేసుకుని, జాతీయ స్థాయి లీడర్ల అండతో కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పవర్‌లోకి తీసుకొచ్చారని వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో బీఆర్ఎస్‌పై పోరాటం చేసి, కేసులకు భయపడకుండా, వెనక్కుతగ్గకుండా రేవంత్ కష్టపడి పనిచేశారని స్పష్టం చేశారు. కౌశిక్‌రెడ్డి తన భార్య, కూతురు కుటుంబ సభ్యులను ముందర‌పెట్టి.. గెలిస్తే జయయాత్ర లేదంటే శవయాత్రకు రండి అంటూ జనాన్ని భయపెట్టి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. కౌశిక్‌రెడ్డివి బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ అని ఆరోపించారు. ఎమ్మెల్యే పాడికి మతి భ్రమించిందని, అందుకే టీపీసీసీ చీఫ్ పదవి కోసం సీఎం రేవంత్ తన కాళ్లు మొక్కారని ఇటీవల మాట్లాడారని వెల్లడించారు. రేవంత్ తన స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగారని, విలక్షణమైన నాయకత్వ లక్షణాలతో రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సీఎంపైన తప్పుడు ప్రచారం బంద్ చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking