ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదు,

కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తీరు ,దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం,
ఇంద్రవెళ్లి కి ప్రత్యేకత ఉంది ,కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చేందుకు ఆ ప్రాంతం దోహదపడిన ప్రాంతం,
పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్‌ రెడ్డి ఎన్నికైన తర్వాత మొదటి సభ అక్కడే నిర్వహించాం,
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటి సభ అక్కడే నిర్వహించాం,
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ రెడ్డి గారు, అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు,
ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్న భద్రత దృష్ట్యా హెలికాఫ్టర్‌ వాడుతారు,
ప్రైవేట్‌ కార్యక్రమాలకు మీరు, చాపర్లు, ఏలికాఫ్టర్లు వాడలేదా?
తొమ్మిదిన్నర ఏండ్లలో మీరు దోచుకున్న అవినీతి సొమ్ము ఎంత ? కాళేశ్వరం ప్రాజెక్టు లో మీరు నొక్కిన డబ్బు ఎంత? మెడిగడ్డ ప్రాజెక్టు లో మీరు తీసుకున్న కమీషన్‌ ఎంత?
మీరు లెక్కలు చెప్పగలరా,మీ లెక్కలన్ని త్వరలో మేము బయటకు తీస్తాం,
మీరు మహిళ నాయకురాలు గా ఉండి లిక్కర్‌ వ్యాపారం చేసి మన నిజామాబాద్‌ పరువు తీసినవ్‌,
వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మీ పార్టీ భూ స్థాపితం అవుతది.
17 పార్లమెంట్‌ స్థానాలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తది,
45రోజుల ముఖ్యమంత్రి రేవంత్‌ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు,
కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ,ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరుతాం,
కేసీఆర్‌ కుటుంబం చేసే చౌకా బార్‌ రాజకీయాలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు,
ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే స్థాయి కవితకు లేదు,
రాహుల్‌ గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేస్తే దేశం నిలబడిరది,
సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ కు ఖచ్చితంగా వస్తారు ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.

Leave A Reply

Your email address will not be published.

Breaking