హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 18
ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పర్లపల్లి నాగరాజు ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యువకుల సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే నాగరాజు కు సూచించారు ఈ సందర్భంగా పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తర్వాత మొట్ట మొదటిసారి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ను కలిసి ఆశీస్సులు తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కచ్చితంగా యువకుల సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవ్వడం మరింత బాధ్యతను పెంచిందని అన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు టేకుల శ్రావణ్,చెంచల మణిదీప్, ఆకునూరి అజిత్,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు