ప్రజాబలం మందమర్రి డిసెంబర్ 18 :
మందమర్రి ఏరియాలోని సి.ఇ.ఆర్ క్లబ్ లో బుధవారం సింగరేణి దినోత్సవ వేడుకలు-2024 సందర్భంగా మహిళలకు బాల్ ఇన్ బాస్కెట్, బాంబ్ ఇన్ బ్లాస్ట్, దీపాలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి సేవ ప్రెసిడెంట్ జి.స్వరూపరాణి దేవేందర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలిచిన మహిళలకు డిసెంబర్ 23 న సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించే సింగరేణి దినోత్సవ వేడుకలలో బహుమతులు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. సింగరేణి సంస్థ స్వయం ఉపాధి పొందే విధంగా ఎన్నో వృత్తి శిక్షణ కోర్సులు కూడా మహిళలకు అందజేస్తుంది కావున ప్రతి ఒక్కరూ ఇలాంటి సదావకాశాలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్ సుందర్, డి.వై పి.ఎం ఎం.డి ఆసిఫ్, లేడీస్ క్లబ్ మెంబర్స్ మహిళలు పాల్గొన్నారు.