ప్రజా బలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 18:ప్రతి సంవత్సరం లాగానే శీతాకాల విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి తిరిగి వెళ్లిన అనంతరం రాష్ట్రపతి నిలయాన్ని సందర్శంచడానికి ప్రజలకు వీలు కల్పించడం జరుగుతుంది, కాని ఈసారి మాత్రం ఒక ప్రధాన ఉద్దేశంతో ఉద్యాన్ ఉత్సవ్ అనే కార్యక్రమంతో సందర్శకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్యామ్యుల్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
బుధవారం మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్ లో నిర్వహించిన సమావేశంలో మేడ్చెల్ మల్కాజిగిరి జల్లా కలెక్టరు గౌతం తో కలిసి జాయింట్ సెక్రటరీ శ్యామ్యుల్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాష్ట్రపతి శీతాకాల విడిది ముగించుకొని వెళ్లిన అనంతరం కొన్నిరోజులు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఉంటుంది.ఈ సారి ఆ సందర్శన కార్యక్రమానికి ఉద్యాన ఉత్సవ్ అనే పేరుతో మరింత ఆహ్లాదకర వాతావరణంతో పాటు స్టాల్స్, చిన్న చిన్న కుటీరాలను ఏర్పాటు చేయడంమే కాకుండా ఒక పిక్నిక్ స్పాట్ గా తయారు చేయడం జరుగుతుందని, అధిక సంఖ్యలు ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అగ్రికల్చర్ అథారిటీ ఇనిస్టట్యూట్ , సాంస్కృతిక, టూరిజం శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేక భౌగోళక వ్యవసాయం, సమీకరణ వ్యవసాయం పై అవగాహాన కల్పించేలా కుటీరాలను, స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రజలలో అవగాహాన పెంచాలన్నారు. నిర్దేశిత ప్రాంతాలలో నిర్దేశిత పంటలు, వ్యర్థాలతో ఉపయోగాల తయారీ గురించి ప్రజలకు, విద్యార్థులకు తెలిసేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. తమ తమ ఇళ్లలో నర్సరీ, గార్డనింగ్ ఎలా చేసుకోవాలో తెలిపేలా చిన్న చిన్న మెళకువలతో స్టాల్స్ ను ఏర్పాటు చేస ప్రజలకు తెలపాలన్నారు. పిక్నిక్ స్పాట్ లా ఉండేలా పిల్లలకు ప్లే ఏరియా ఉండేలా చూడాలన్నారు. ఇంతే కాకుండా చిరుతిండ్లు స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఉద్యాన ఉత్సవ్ ను తిలకించేందుకు వసతి గృహాల విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకువచ్చి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించి ఒక తీపి గుర్తుగా ఉండిపోయేలా వారి జ్ఞాపకాలలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా ప్రచారం చేయాలన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన త్రాగునీరు, అంబులెన్స్, మోబైల్ టాయిలెట్లు, రవాణా , లైటింగ్ వంటి మౌళిక వసతులను సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేయాలన్నారు. సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరు మంచి అనుభవంతో పాటు మంచి అనుభూతితో తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అగ్రికల్చర్ సరవనన్ రాజ్, జాయింట్ సెక్రటరీ ఉదయ్ కుమార్, జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి, సోషల్ వెల్పేర్ అధికారి వినోద్ కుమార్, డిఈఒ విజయ కుమారి, హర్టికల్చర్ ఆఫీసర్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.