కే.సీ.ఆర్ మరియు కే.టీ.ఆర్ ల రోడ్డు షోలతో బెంబేర్లేత్తుతున్న ప్రతిపక్షాలు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 08 మే 2024:
చేవెళ్ల పార్లమెంట్ బీ.ఆర్.ఏస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకై మంగళవారం రోజున రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అంతర్ భాగమైన మణికొండలో బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రతీ కాలనీ, ప్రతీ వీధిలో పాదయాత్ర కొన సాగిస్తూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను కలుస్తూ ఈ నెల 13న జరిగే ఎన్నికలలో ఈ.వీ.ఎం బ్యాల్లెట్లోనీ 1వ నంబర్ కార్ గుర్తు బటన్ పై నొక్కి అమూల్యమైన ఓటును ఎల్లవేళల అన్నా అని అంటే నేనున్నా అనే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు వేసి, ఆశీర్వదించి కని విని ఎరుగని మెజారిటీతో పార్లమెంట్ కు పంపాలని, ఈ సందర్భముగా కార్య కర్తల సంఘటనా శక్తితో కార్ ను గెలుపు దిశగా ముందుకు సాగించాడన్ని చూస్తూ మరియూ కే.సీ.ఆర్, కే.టీ.ఆర్ ల రోడ్డు షోలతో బెంబర్లేత్తుతున్న ప్రతిపక్షాలు కల్లబొల్లి వాగ్దానాలు చేస్తున్నారని వాటికి నమ్మకుండా సంక్షేమ పథకాలు అమలు చేసిన కే.సీ.ఆర్ యొక్క పరి పాలనా దక్షతను ఒకమారు జ్ఞాపకం చేసుకోని కార్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి, కార్యక్రమంలో మణికొండ బీ.ఆర్.స్. పార్టీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణ రెడ్డి, మాజీ ఎం.పీ.పీ తలారి మల్లేశ్ ముదిరాజ్, పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య శ్రీరాములు, శైలజా వినోద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగల్ల ధనరాజ్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, సీనియర్ నాయకులు సీతారాం దాస్, అందె లక్ష్మణ్ రావు, లక్ష్మయ్య, రాజేంద్ర ప్రసాద్, గొరుకంటి విఠల్, గుట్టమిది నరేందర్, బండమీది మల్లేశ్, బాబు లతోపాటు ఉత్సాహంగా పాల్గొన్న యువ నాయకులు, మహిళా నాయకురాల్లు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.

             

Leave A Reply

Your email address will not be published.

Breaking