సెక్రటేరియట్ ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ని అడుగుతున్న ఇలా దాడులు చేయించడం కరెక్టేనా?
బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ విషయంపై మాట్లాడండి.
ఇట్లా దాడులు చేయించడం పై సమాజానికి ఏం సందేశం ఇస్తారు?
ఈ దాడులు ఎటువైపు దారి తీస్తాయో మీకు తెలియదా?
ప్రజా ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..
కుట్రపూరితంగా దుర్మార్గమైన దాడుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుంది..
ఉద్యోగులు అధైర్య పడవద్దు.. మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి.
నిత్యం పేద ప్రజల కోసం పని చేసే ఒక నిబద్ధత కలిగిన కలెక్టర్..
ఐటీడీఏ లో అమాయకులైన గిరిజన ప్రజల కోసం పని చేసిన అధికారి
ప్రజల కోసం ప్రభుత్వం తరుపున ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఎలా ఆదుకోవాలని వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ అధికారి పైన దాడులు చేయిస్తారా ..?
దాడికి కారుకులైన వారు ఎవరైనా వదిలిపెట్టాం.. వెనుక ఎంత పెద్ద వారు ఉన్న చట్ట ప్రకారం శిక్షిస్తాం.
అమాయకులను బలిచేసి లబ్ధిపొందాలని కెసిఆర్,కేటీఆర్,హరీష్ చూస్తున్నారు….
నాడు కూడా ఉద్యమంలో అమాయకులు బలిదానాలు చేసుకుంటే మీ కుటుంబం రాజకీయ లబ్ధి పొందింది….
మరలా ఇప్పుడు కూడా అలాగే అమాయకులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేపించి కెసిఆర్ కుటుంబం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు….