మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ బుధవారం నాడు బిఅర్ ఎస్ పార్టీ తూప్రాన్ మండల అధ్యక్షులు బొల్లంపల్లి
బబుల్ రెడ్డి సమక్షంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గీతా కార్మికులకు రైతు బీమా తరహా పథకం 5 లక్షల బీమా ప్రకటించినందున అలాగే హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంకుబండు పైన నెక్లెస్ రోడ్ వద్ద నీరా కేఫ్ ను ప్రారంభించడం చాలా సంతోషకరం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి గౌడ కులస్తులు ఎల్లవేళలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు కౌన్సిలర్ రామునీ గారీ శ్రీశైలం గౌడ్, రవీందర్, మెదక్ జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షులు,తాజా మాజి సర్పంచ్ బొంది వెంకట్ గౌడ్ , మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ్ కి నేత , దేశంలోనే ఎక్కడ లేని మన ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో మన తేలంగాణ రాష్ట్రంలో నే అమలు అవుతున్నాయని అన్ని కులాల సంఘాల ప్రజలను అభివృద్ధి పథంలో వుంచడమే మన ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం అని మనం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రవీందర్ గౌడ్, మహేష్ గౌడ్, చిన్నలింగ్ మల్లిఖర్జును గౌడ్, శ్రీధర్, నాగరాజు,బాయీకాడి ఆంజనేయులు,సిందే చంద్రం
,పుర్ణ రాజు,క్రీష్ణా గౌడ్,
మైనార్టీ నాయకులు గౌస్ భాయ్ మరియు గౌడ కులస్తులు, మహేష్, బిక్షపతి, గీత కార్మికులు, జగంపేట నిర్మల గౌడ్ , నాగరాజుగౌడ్, రమేష్ గౌడ్, శ్రీధర్ , బాలకృష్ణ , ఆంజనేయులు , ప్రజా ప్రతినిధులు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.