హైదరాబాద్ మే 3 :మే డే పురస్కరించుకొని హేల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ కాకుమాను జ్యోతి ఆద్వర్యం లో తార్నాక లో 100 మంది కార్మికులకు కొత్త బట్టలు పంపిణి చేసారు.ఈ కార్యక్రమం లో తార్నాక బిఆర్ఎస్ నాయకుడు రాజనరసింహ ,చారిటీ సభ్యులు జగదాంబ.శాంతి.సునీత రెడ్డి.కె.ప్రవీణ్ కుమార్ శాంత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జ్యోతి మాట్లాడుతూ మా టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ నిరుపేదలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే అనీక ప్రాంతాల్లో పేదలకు కొత్త బట్టలు, విద్యార్థులకు పుస్తకాలు, వృద్దులకు దుప్పట్లు, రంజాన్ సందర్బంగా ముస్లిం సోదరులకు కొత్త బట్టలు పంపిణి చేసినట్లు తెలిపారు.దాతల సహాయం, ప్రోత్సహం ఉంటె బవిషత్ లో మరిన్ని సీవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. .