లక్షెట్టిపేట ఎమ్మార్వో కార్యక్రమ ఎదుట ధర్నా, డబుల్ బెడ్ రూం పేరుతో పేద ప్రజలను డబుల్ మోసం చేసిన కేసిఆర్ మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 04 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో అర్హులైన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో అర్హులతో కలిసి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసిఆర్ కి దోచుకోవడం ఉన్న శ్రద్ధ పేద ప్రజల పై లేదని అన్నారు. గత 9 సంవత్సరాలలో ఒకరికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు అందించకుండా పేద ప్రజలను మోసం చేశారని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస యోజన ద్వారా వస్తున్న రాష్ట్ర ప్రజలకు రాకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ అడ్డుకుంటున్నారని అన్నారు.రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే అర్హులైన పేద ప్రజలకు అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ పేరుతో పేద ప్రజలను ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ మోసం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి ఉండే ప్రగతి భవన్ 4 నెలల్లో,ఎమ్మెల్యే దివాకర్ రావు క్యాంప్ ఆఫీస్ 6 నెలల్లో పూర్తి చేసుకున్నారు కానీ పేద ప్రజలకు మాత్రం డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అని అన్నారు. ప్రధాన మంత్రి అవాస యోజన ద్వారా మోదీ గారి ప్రభుత్వం దేశం అంతట ఇండ్లు కట్టిస్తు ఉంటే మన రాష్ట్ర ప్రజలకు ఆ ఇండ్లు దక్కకుండా కేసిఆర్ అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు కట్టిస్తామని అన్నారు.జిల్లా ప్రజలు కాంగ్రెస ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయారని అన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోనుగోటి రంగ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్,జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్,పట్టణ అధ్యక్షులు వీరమల్ల హారి గోపాల్,రమేష్ జైన్,వేముల మధు,పడిపాల రమేష్ మూష్కం గంగన్న, మోటపలుకుల సతీష్, లకవత్ రవీందర్,పంచాల రమేష్,సుధాకర్,ఆనంద్, బాబు లాల్,ఈశ్వర్, చిన్నయ్య,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.