బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 7న తిరుపతి లో బహిరంగ సభను విజయవంతం చేయాలి.

మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరిక్రిష్ణ.

మెదక్ జిల్లా ప్రతినిధి, ఆగస్టు, 4 ప్రజా బలం న్యూస్ :-

అగస్టు 7 న తిరుపతి లో జరిగే అఖిలభారత జాతీయ ఓ.బి.సి 8వ మహా సభను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు విడుదల చేసిన మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరిక్రిష్ణ అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు ఎంపీపిల ఫోరం శివ్వంపేట ఎంపిపి కల్లూరి హరిక్రిష్ణ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. అందుకే బిసి జండా పట్టు.. ఆగస్టు 7న తిరుపతి బాట పట్టాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బిసి ఉద్యమం ద్వార రాజకీయ నిర్మాణం చేపట్టడానికి జాతీయ మహా సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యా, ఉద్యోగాల్లో బిసిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎవరికి లేని క్రిమిలేయర్ తెలంగాణ లో కేవలం బిసిలకే నిబంధనలు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. మండల్ సిఫార్సు అమలు జరిగే వరకు ఉద్యమం ఉవ్వెత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. బీసీలకు మేమెంతో మాకు అంత వాట కావాలి అని మీడియాతో మాట్లాడుతూ హరిక్రిష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లిఖార్జున్ గౌడ్, గడ్డం ప్రశాంత్ కుమార్, గడ్డం వెంకటేష్ సహచర బిసి ఉద్యమ నేతలతో కలిసి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహదేవ్ గౌడ్, శివయ్య మేస్త్రి బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking