బావి భారత ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై గుజరాత్ సెషన్ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించడంతో మెదక్ పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఇది ప్రజాస్వామ్యవాదుల విజయమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మోల్ సబ్ పేర్కొన్నారు.సూర్యచంద్రులను, నిజాన్ని ఎక్కువ సమయం దాచలేరని, తెలిపారు.రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వం కూడా వెంటనే పునరుద్ధరించాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విక్రమ్, బబ్లు, శ్రీకాంత్ రెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ sc సెల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, లాలు భాయ్, మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి, జాకీర్, వెంకటేష్, నర్సింలు, అమీర్, బిక్షపతి, చందర్, చోటు, సామెల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking