కీ. శే. చిన్నారి చిత్తారు గీతాన్ష్ కు మెతుకు వేయు కార్యక్రమం లో పాల్గొన్న అఖిల భారత యాదవ మహాసభ నాయకులు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 21(ప్రజాబలం)ఖమ్మం అఖిల భారత యాదవ మహాసభ నాయకులు, సిపిఐ జిల్లా నాయకులు పుచ్చకాయల కృష్ణ మనవడు చి. గీతాన్ష్ ఐదు రోజుల క్రిందట అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ చిన్నారికి ఈరోజు మెతుకు వేయు కార్యక్రమం వైరా మండలం కేజీ సిరిపురం గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తార సింహాద్రి యాదవ్ పాల్గొని చి. గీతాన్ష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చిన్నపసి వయసులోనే కేవలం నాలుగేళ్ల ప్రాయంలో దురదృష్టవశాత్తు నూరేళ్లు నిండటం చాలా దురదృష్టకరమని, కుటుంబం యొక్క బాధ చాలా విషాదకరమని, ఆ లోటును ఎవరు పూడ్చలేరని విచారం వ్యక్తం చేశారు. కల్లాకపటం తెలియని ఆ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో చిత్తారు నాగేశ్వరరావు చిట్టెమ్మ, పుచ్చకాయల కృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ పతే మహమ్మద్, చేతుల నాగేశ్వరరావు, మొరిమేకల కోటయ్య, పుచ్చకాయల కోటయ్య పురం అంజన్ కుమార్, మూడుముంతల గంగరాజు బండారు ప్రభాకర్ సిరిపరపు ప్రభాకర్, శీలం పుల్లయ్య, సింగం వెంకన్న మరియు యాదవ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు