ప్రభుత్వ పాఠాశాలల్లో ఎ ఐ సేవలు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 21:
ఎఫ్ ఎల్ ఎన్ ఫండమెంటల్ లిటరసీ మరియు న్యూమరసి ( ప్రాథమిక స్థాయి విద్యార్థులకు భాషా గణిత సామర్థ్యాల సాధన) కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ల ద్వారా పైలెట్ ప్రాజెక్టు చేపట్టడం కొరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా వీడియో కాన్ఫరెన్స్.
శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా రాష్ట్రంలోని ఎంపిక కాబడిన 6 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఐ.విజయ్ కుమారి తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో చేపట్టనున్న ఈ పైలెట్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్లను మరియు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా రాష్ట్ర విద్యాశాఖ ద్వారా అందజేసే ఎఫ్ ఎల్ ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా, పాఠశాలలో భాషా గణిత సామర్థ్యాలలో వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి ఈ ప్రత్యేకమైన టూల్ ద్వారా విద్యార్థులలో సామర్ధ్యాలను పెంపొందించే దిశగా ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం చేయాలని సూచించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే కంప్యూటర్ లు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, మరికొన్ని పాఠశాలల్లో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking